Tuesday, June 28, 2011

మనసు ఒక మౌనం


మనసు ఒక మౌనం, కాని నేను నీ మనసు లోని మౌనాన్ని మాటలుగా మార్చాలి అనుకున్నా,
కాని పెదవులు కదలక మాటలు కాస్త మూగబొయినాయి
కళ్ళలొని కాంతి  తేజస్సు వీడి తన్మయం చెందవలసిన సమయం లొ తనకొసం తపి0చిన  
మాటలను  కళ్ళతొ పలికించ లేక బింధువుల రూపంలొ భాష్పలుగా పంపుతున్నాయి....
ఓ మాటలు  రాని మౌనమా. .. ఈ భాష్పలని శాశ్వత జలధారగా మార్చద్దు అని మౌనంగా పంపుతున్న
ఈ నా మౌన సంభాషణ శ్వాశగా నీ దరి చేరి  నిన్ను  నా దరి చేరుస్తుంది  అని ఆశగా జీవిస్తున్నా....

Tuesday, February 8, 2011

కలలు లేని వేళ కావ్యం


 నా కల నీ రూపం కోసం వెతుకుతుంది
నా కవిత నీ  భావం కోసం పరితపిస్తుంది
నా  మనసు నీ చెలిమి కోసం పరుగెడుతుంది
నా ఊహ నీ మనసుతో ఊయల ఊగుతుంది



నీ జ్ఞాపకాలతో నా కాలం పయనిస్తుంది
నీ శ్వాసతో నా గుండె ఊపిరి తీసుకొంటుంది
నీ ఊహ తో నా  ప్రపంచం ఆవిర్బస్తుంది 
నిన్ను చూచిన నాడు నా కళ్ళకు కమనీయం

నీ కోసం నా కోరిక పరిగెడుతుంది
నీ కోసం నా ఊహ జన్మిస్తుంది
నీ కోసం నా కనులు కాంతులు విరజిమ్ముతుంది
నీ కోసం నా మనసు ఓ విశాలమైన విరంహంతో విచారిస్తూ,  తాపంతో తపనపడుతూ, మైకంతో తడబతున్నది...

భాస్కర్ రెడ్డి


మా మధు

వెన్నలాంటి మనసు సూర్యుని లాంటి తేజస్సు కర్ణుడు లాంటి దానగుణం నీదే కదా
ఎకలవ్యుడి లాంటి ఏకగ్రత విధురుడు లాంటి తెలివి ఈ కలియుగములో నీదే కదా
నీ మాటలు కోయల రాగము కన్నా తీయ్యనివి కదా
తన అనే పదాని అర్దం మన అని మార్చినది నీవే కదా
నమ్మకానికి మరుపేరు మధు కాదా
ఊహ కన్నా వేగవంతమైనది నీ ఆలొచనే కదా
స్నేహాని కి రూపం నీవే కదా
మా బాధలకు ఓర్పు నీవే కదా
మా గెలుపుకు నాంది నీవే కదా
మధురమైన భావాలు కలిగిన మాదుర్యం నీవే కదా
చంద్రుని అంత చల్లగా నక్షత్రం లా నిరంతరమూ మా కోసం ప్రకాసిస్తూ ఉన్న నీకు మేము ఏమి ఇవ్వగలము ఈ కవితను తప్ప

నేను నేనే



నీ  పెదవుల కదలికే  నా మనసులోని మాట
నా మనసుకి కళ్ళు నువ్వే
నా మనసుకి రూపం, ప్రతిరూపం నువ్వే
నా గుంఢెలోని చప్పుడు .. నీ హ్రుదయ స్పందనే

నా గుంఢెలోని బాధ .. నీ మనసులోని మౌనమే కదా..
నాకు తెలిసిన కల(కళ) నీవే(నీ రూపమే)
నా కలల తీరం నువ్వె కదా
నా గుంఢె అలలు నీ పెదవుల చిరునవ్వులే
నా జీవిత గమ్యం  ఎటైన .. వెళ్ళే దారి మాత్రం నువ్వే కదా

అప్పుడు................. నువ్వు లేక నేను లేను ...
ఇప్పుడు...............................  నువ్వే నేను ...
రేపు..................................................................... నేను నేనే...

ప్రేమ అలజడి



నా మనసులో ఉప్పొంగే భాధ నీ మౌనమే కదా
నా మొహంలో కనపడే చిరునవ్వు నీ ప్రతిరూపమే కదా
నా ఊహల ఊయల నీవే కదా
నా చూపుల దారి నీ అడుగుల తీరమే కదా
నన్ను నిద్రలేపునది నీ అలజడే కదా
నేను వేచి చూసేది నీ చిరునవ్వు కోసమే కదా
నీ పలుకులు ఆ కోయల రాగాలే కదా
ప్రేమకు రూపం ఉంటే అది నీవే కదా
నాకొసం వేచి చూసే ప్రేమ నీవే కదా
నన్ను మరిపించె మైమరపు నీవే కదా ప్రియా

ప్రేమికుని భావా(ధ)లు


నన్ను శాశించే శాశనం నీవే కదా
నన్ను లాలించే లాలన నీదే కదా
నన్ను హింసించే హింస నీవే కదా
నన్ను కవ్వించే చూపు నీదే కదా !!!


నా భాధకు భావం నీవే కదా
నా ఆనందాని అడ్డు నీవే కదా
నా ఆశలకు అవది నీవే కదా
నా ఊహకు ఉప్పెన నీవే కదా !!!


నా పొరపాటుకి అలవాటు నీవే కదా
నా ఎదుగుదల కు తగ్గుదల నీవే కదా
నా నిద్రకు మెలుకువ నీవే కదా
నా మరుపుకి మైత్రివి నీవే కదా !!!


నా కవితలకు కలము నీవే కదా
నా భవితకు భారం నీవే కదా
నా త్రుష్ణకు తీరం నీవే కదా
నా కష్టాలకి కారణం నీవే కదా !!!


నా ఆశకు శ్వాశ నీవే కదా
నా ఇష్టాలకు నష్టం నీవే కదా
నా మనసకు మారు పేరు నీదే కదా
నా కోరికలకు కొలమానం నీవే కదా
నా చూపుల గమ్యం నీవే కదా
నా జీవితానికి జలగవు నీవే కదా నీవే కదా!!! !!!




గమ్యం తెలిసినా దారి తెలియక సతమతమౌతున్న సామాన్యుడిలా 
మరిచి పోవాలనుకున్నా మరిచిపోలేని భావాలకు(భాధలకు) బై చెప్పాలనుకొని...

---
భాస్కర్ రెడ్డి