నా కల నీ రూపం కోసం వెతుకుతుంది
నా కవిత నీ భావం కోసం పరితపిస్తుంది
నా మనసు నీ చెలిమి కోసం పరుగెడుతుంది
నా ఊహ నీ మనసుతో ఊయల ఊగుతుంది
నీ జ్ఞాపకాలతో నా కాలం పయనిస్తుంది
నీ శ్వాసతో నా గుండె ఊపిరి తీసుకొంటుంది
నీ ఊహ తో నా ప్రపంచం ఆవిర్బస్తుంది
నిన్ను చూచిన నాడు నా కళ్ళకు కమనీయం
నీ కోసం నా కోరిక పరిగెడుతుంది
నీ కోసం నా ఊహ జన్మిస్తుంది
నీ కోసం నా కనులు కాంతులు విరజిమ్ముతుంది
నీ కోసం నా మనసు ఓ విశాలమైన విరంహంతో విచారిస్తూ, తాపంతో తపనపడుతూ, మైకంతో తడబతున్నది...
భాస్కర్ రెడ్డి