Tuesday, February 8, 2011

ప్రేమికుని భావా(ధ)లు


నన్ను శాశించే శాశనం నీవే కదా
నన్ను లాలించే లాలన నీదే కదా
నన్ను హింసించే హింస నీవే కదా
నన్ను కవ్వించే చూపు నీదే కదా !!!


నా భాధకు భావం నీవే కదా
నా ఆనందాని అడ్డు నీవే కదా
నా ఆశలకు అవది నీవే కదా
నా ఊహకు ఉప్పెన నీవే కదా !!!


నా పొరపాటుకి అలవాటు నీవే కదా
నా ఎదుగుదల కు తగ్గుదల నీవే కదా
నా నిద్రకు మెలుకువ నీవే కదా
నా మరుపుకి మైత్రివి నీవే కదా !!!


నా కవితలకు కలము నీవే కదా
నా భవితకు భారం నీవే కదా
నా త్రుష్ణకు తీరం నీవే కదా
నా కష్టాలకి కారణం నీవే కదా !!!


నా ఆశకు శ్వాశ నీవే కదా
నా ఇష్టాలకు నష్టం నీవే కదా
నా మనసకు మారు పేరు నీదే కదా
నా కోరికలకు కొలమానం నీవే కదా
నా చూపుల గమ్యం నీవే కదా
నా జీవితానికి జలగవు నీవే కదా నీవే కదా!!! !!!




గమ్యం తెలిసినా దారి తెలియక సతమతమౌతున్న సామాన్యుడిలా 
మరిచి పోవాలనుకున్నా మరిచిపోలేని భావాలకు(భాధలకు) బై చెప్పాలనుకొని...

---
భాస్కర్ రెడ్డి





No comments:

Post a Comment